Hyderabad: గచ్చిబౌలి FCI లేఅవుట్‌లో హైడ్రా ఆకస్మిక తనిఖీలు
Hyderabad: గచ్చిబౌలి FCI లేఅవుట్‌లో ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. కబ్జాకు గురైన రోడ్లు, పార్కుల స్థలాల రీ-మార్కింగ్‌పై యంత్రాంగం దృష్టి.
Hyderabad: గచ్చిబౌలి FCI లేఅవుట్‌లో హైడ్రా ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: గచ్చిబౌలి FCI లేఅవుట్ ను సందర్శించిన హైడ్రా (HYDRAA) మరియు CMC (సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) బృందం.ఎఫ్‌సీఐ లేఅవుట్ కబ్జాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిఎంసీ కమిషనర్ సృజన ఉన్నతాధికారులు.
కబ్జాకు గురైన రోడ్లు, పార్కులు!*
రెండు దశాబ్దాలుగా నలుగుతున్న FCI లేఅవుట్ వివాదం లేఅవుట్‌లోని 40 అడుగులు, 25 అడుగుల రోడ్లను సైతం కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై నజర్! హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన యంత్రాంగం.. రోడ్లు, పార్కుల స్థలాలను రీ-మార్కింగ్ చేసే అవకాశం..
గతంలో ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల తదుపరి పురోగతిని పర్యవేక్షించారు.. సంధ్యా కన్వెన్షన్ పరిసరాల్లో రోడ్ల ఆక్రమణలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుకున్న హైడ్రా. అక్రమ కట్టడాల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ.. నేడు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన..




