Ibrahimpatnam: ఏసీపీ కేవీపీ రాజుకు ప్రతిష్టాత్మక 'ఉత్తమ సేవా పతకం'!

Ibrahimpatnam: విధి నిర్వహణలో అంకితభావం, సమర్థవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజుకు "ఉత్తమ సేవా పతకం" లభించింది. శుభాకాంక్షల వెల్లువ.

RAVI, IBRHAMIPATNAM
Published on: 15 Aug 2026 1:07 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: ఏసీపీ కేవీపీ రాజుకు ప్రతిష్టాత్మక 'ఉత్తమ సేవా పతకం'!

Ibrahimpatnam: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజుకు ప్రతిష్టాత్మక “ఉత్తమ సేవా పతకం” అవార్డు లభించింది.

ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో ఆయన చూపిన కృషికి ఈ గుర్తింపు లభించింది. విధి పట్ల నిబద్ధత, నిజాయితీ, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

ఈ సందర్భంగా ఏసీపీ రాజు సార్‌కు పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. మరిన్ని ఉన్నత సేవలు అందించి పోలీసు శాఖకు, ప్రజలకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.

“ప్రజా సేవే లక్ష్యంగా… విధి నిర్వహణే బాధ్యతగా… ఉత్తమ సేవకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు.”

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story