Ibrahimpatnam: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసి సమస్యలు వివరించిన దళిత కుటుంబాలు

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని అనాజ్‌పూర్ దళిత కుటుంబాలు కలిసి సమస్యలు విన్నవించాయి.

AJAY, HAYATH NAGAR
Published on: 27 Aug 2026 4:20 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసి సమస్యలు వివరించిన దళిత కుటుంబాలు

ఇబ్రహీంపట్నం: దళితుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా ముందుకు సాగుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.

అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన పలువురు దళిత కుటుంబ సభ్యులు గురువారం ఉదయం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసి గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి రాఖీలు కట్టి తమకు ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు గ్రామ పెద్దలు, దళిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story