Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో 3వ బెటాలియన్ 'స్పోర్ట్స్ మీట్ 2026' ప్రారంభం!
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కమాండెంట్ జమీల్ భాషా. క్యాంప్ ఆఫీస్ అభివృద్ధికి హామీ.
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో 3వ బెటాలియన్ 'స్పోర్ట్స్ మీట్ 2026' ప్రారంభం!
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో 3 వ బెటాలియన్ ఆధ్వర్యంలో 2026 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మరియు కమాండెంట్ సయ్యద్ జమీల్ భాష పాల్గొన్నారు. మొదటగా 100 మీటర్ల పరుగు పందెం ను జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ...క్రీడలు క్రమశిక్షణ, మరియు శారీరక దృఢమైన శరీరం కోసం మానసికౌల్లాసాన్ని నింపుతాయని అన్నారు. క్రీడలు ఒక గెలుపు ఓటమిలకే పరిమితం కావు అని. ఆత్మవిశ్వాసాన్ని. పెంపొందిస్తాయి అన్నారు.
బెటాలియన్ క్యాంపు ఆఫీసు కోసం Hmda ఫండ్స్ నుంచి 90 లక్షలు రూపాయలతో బిటి రోడ్డు వేయించడం జరిగిందని . భవిష్యత్తులో మరిన్ని నిధులు వెంచిచి బెటాలియన్ క్యాంప్ ఆఫీస్ ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 3 వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది మరియు వివిధ అధికారులు పాల్గొన్నారు.




