Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రంగారెడ్డి 400 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి 400 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలపై వివాహాల సమయంలో పడే ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో నియోజకవర్గంలో 10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో 22 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు.ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల అమలుతో పాటు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను అందించి వారిని యజమానులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గానికి 3,000 కోట్ల నిధులను తీసుకువచ్చినట్లు చెప్పారు.
మహిళా సంఘాలకు ప్రత్యేక మహిళా భవనాలను నిర్మిస్తామని, యువత, మహిళలు, నిరుద్యోగులకు కొత్తగా నిర్మించనున్న ఫ్రూట్ మార్కెట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని నంబర్-1 స్థానంలో నిలిపేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు.




