Ibrahimpatnam Municipality: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం..!

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌. ఛైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి, వైస్‌ ఛైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ ముత్యాల శ్యామల ఎన్నిక. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 4 April 2026 1:12 PM IST
Ibrahimpatnam Municipality
X

Ibrahimpatnam Municipality: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం..!

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య సమీకరణాల నడుమ మున్సిపాలిటీని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా బీజేపీ నిలవడంతో, పదవుల పంపకంలో భాగంగా వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవి బీజేపీని వరించింది. బీజేపీ కౌన్సిలర్‌ ముత్యాల శ్యామల వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అధికార కాంగ్రెస్‌కు చెక్ పెట్టే క్రమంలో బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఏకతాటిపైకి రావడం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి పంతం నెగ్గించుకున్న బీఆర్‌ఎస్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై గులాబీ జెండాను ఎగురవేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story