Ibrahimpatnam: 51 గ్రాముల ఎండీఎంఏతో ఇద్దరి అరెస్ట్
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం వద్ద ఎస్‌ఓటీ మహేశ్వరం, స్థానిక పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించి 51 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Ibrahimpatnam: 51 గ్రాముల ఎండీఎంఏతో ఇద్దరి అరెస్ట్
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఓటీ మహేశ్వరం జోన్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు SOT మహేశ్వరం మరియు ఇబ్రహీంపట్నం పోలీస్ లు సంయుక్త దాడులు నిర్వహించి, నిషేధిత మత్తు పదార్థమైన ఎండీఎంఏ (MDMA – Methamphetamine) సుమారు 51 గ్రాములతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు బెంగళూరుకు చెందిన పీటర్ అలియాస్ పప్పీ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది.
అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు:
1. అబ్దుల్ మిషాల్ ఏ.వి. అలియాస్ అబ్దుల్ మిషాల్ ఆయేషా విట్టల్, వయస్సు 33 సంవత్సరాలు, తండ్రి పేరు నూరుల్ హమీద్ ఏ.వి., స్వస్థలం మలప్పురం జిల్లా, కేరళ రాష్ట్రం. ఇతను డ్రగ్స్ విక్రయించడంతో పాటు స్వయంగా వినియోగించే వ్యక్తిగా గుర్తించబడ్డాడు.
ఇతనిపై గతంలో కూడా ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
- క్రైమ్ నం. 139/2023, సెక్షన్ 8(c) r/w 20 NDPS Act, కృష్ణలంక పోలీస్ స్టేషన్, విజయవాడ, ఆంధ్రప్




