Ibrahimpatnam: చిలుకూరు చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అధికారుల నిర్లక్ష్యం

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం చిలుకూరు గ్రామంలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా నల్లమట్టి తరలింపు. వీఆర్వో, అధికారులు స్పందించడం లేదని స్థానికుల ఆగ్రహం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 July 2026 5:48 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: చిలుకూరు చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అధికారుల నిర్లక్ష్యం

ఇబ్రహీంపట్నం: మండలంలోని చిలుకూరు గ్రామంలో చెరువు నుండి నల్ల మట్టిని గత వారం రోజులుగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతూ గతంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ నేతే మరల ఈరోజు గ్రామంలో అక్రమ మట్టి తోలకాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఎలాంటి అనుమతి లేకుండా దర్జాగా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నా అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో, సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆ గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో ఫోన్లు ఎత్తకపోవడంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి గత మూడురోజులుగా అక్రమ మట్టి తరలి వెళ్తున్న చెరువులను సంరక్షించాల్సిన గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు.

యదేచ్చగా జేసీపి లతో మట్టి తవ్వి ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. టిడిపి నాయకులు తమ సొంత స్థలాలకు మట్టి తోలుకోవడంతో పాటు అందినకాడికి మట్టి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 50 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి తోలకాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు కళ్ళు తెరిచి మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని కలెక్టర్ వెంటనే స్పందించి మట్టి తొలకాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story