Hyderabad: శంషాబాద్‌లో ప్రతికూల వాతావరణం.. రెండు విమానాల దారి మళ్లింపు
Hyderabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇండిగో మరియు ఎమిరేట్స్ విమానాలు దారి మళ్లాయి.
Hyderabad: శంషాబాద్‌లో ప్రతికూల వాతావరణం.. రెండు విమానాల దారి మళ్లింపు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్ కావలసిన ఇండిగో, ఎమిరేట్స్ విమానాల దారి మళ్లింపు. పుణె నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో 6E6473 విమానం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లింపు. విమానంలో మొత్తం 187 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్ సంస్థకు చెందిన EK 524 విమానం బెంగళూరుకు మళ్ళింపు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాల వెల్లడి వాతావరణం అనుకూలించడంతో తిరిగి హైదరాబాద్కు చేరుకున్న రెండు విమానాలు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు పైలట్ నిర్ణయం. రెండు విమానాలలోను ప్రయాణికులు అంతా సురక్షితం.




