Talakondapally: తలకొండపల్లిలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు!

Talakondapally: తలకొండపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి మండల అధ్యక్షుడు కాసు శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Nov 2026 2:05 PM IST
Talakondapally
X

Talakondapally: తలకొండపల్లిలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు!

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం భారత తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం తలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాసు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దేశ సమగ్రత, పేదల అభ్యున్నతికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం వంటి నిర్ణయాలతో దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, అంజయ్య గుప్తా, సునంద, అజీమ్, రవీందర్ యాదవ్, డిగ్రీ కృష్ణ, చెన్నకేశవులు, డేవిడ్, పబ్బతి వెంకటయ్య, రఘుపతి, జూలపల్లి శ్రీనివాస్, పంతు నాయక్, రమేష్, రాజేందర్ నాయక్, నరేష్, శేఖర్, రాఘవేందర్, సంజీవ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY