Vikarabad: అంతగిరిపల్లి 10వ వార్డులో ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ బీమా!
Vikarabad: వికారాబాద్ అంతగిరిపల్లి 10వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమం జరిగింది.
Vikarabad: అంతగిరిపల్లి 10వ వార్డులో ప్రతి కుటుంబానికి భరోసా ఇందిరమ్మ బీమా!
Vikarabad: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంతగిరిపల్లి _10వ వార్డులో, వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ అర్థ సుధాకర్ రెడ్డి గారి_ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ జై సింహా రెడ్డి గారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ బీమా పథకం ద్వారా ఆర్థిక భద్రత కలుగుతుందని తెలిపారు.
అనంతరం ముఖ్య అతిథి స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.శ్రీ అర్థ సుధాకర్ రెడ్డి గారు. మాట్లాడుతూ... ఇందిరమ్మ జీవిత బీమా పథకం అనేది పేద ప్రజల కోసం తెచ్చిన గొప్ప పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుంది.
కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు గురి కాకుండా భరోసా కలిగించడమే.. ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి శ్రీ.గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రతి కుటుంబానికి ఒకే భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా. (5 లక్షల రూపాయలు.)తీసుకొచ్చారు.
మన వికారాబాద్ లో, మన 10వ వార్డులో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబం కూడా మిగిలిపోకుండా అందరికీ ఈ పథకం అందేలా నేను స్వయంగా బాధ్యత తీసుకుంటా. ((ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే నేరుగా నన్ను సంప్రదించండి.)) నా ఫోన్ నెంబర్. 9440006698 ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో. మరియు వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీ గడ్డం అనన్య గారి. తో. వికారాబాద్ లో మరింత. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే ముందుకు సాగుతాయి" అని గట్టిగా చెప్పారు.
ధన్యవాదములు
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహా రెడ్డి గారు. 25 వ వార్డు కౌన్సిలర్ వినోద్ కుమార్ గారు.మాజీ కౌన్సిలర్ మురళి గారు. శ్రీకాంత్ గారు. మార్కెట్ డైరెక్టర్ రాజు నాయక్ గారు. వాట్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు మున్సిపల్ అధికారులు.అనంతగిరిపల్లి సోషల్ మీడియా ఇంచార్జ్ నందు గారు.. వాడు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




