Kadthal: కర్కల్‌పహాడ్‌లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం: కసిరెడ్డి నారాయణరెడ్డి
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఘనంగా ప్రారంభించారు.
Kadthal: కర్కల్‌పహాడ్‌లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం: కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం, కర్కల్‌పహాడ్ గ్రామంలో సర్పంచ్ బాణావత్ తేజీరాం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సుజాత, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు యాట నరసింహ, మార్కెట్ చైర్మన్ గీత, మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షుడు శంకర్, మాజీ అధ్యక్షుడు బిచ్య నాయక్, ఉప సర్పంచ్ మల్లేపల్లి రవెల శేఖర్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు శారద, పండు, గ్రామ అధ్యక్షుడు పట్నం కృష్ణయ్య, ఇందిరా కమిటీ సభ్యులు వీరయ్య, అర్జున్, శివరాజు, గ్రామ నాయకులు సత్యం, విష్ణు, రవీందర్, పురుషోత్తం, రాజు, అంజి, నరసింహ, వెంకటేష్, శ్రీను, విఘ్నేష్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




