Kukatpally: KPHBలో రూ.43 కోట్లతో ఇందిరమ్మ టవర్స్ నేడు CM రేవంత్ భూమిపూజ!

Kukatpally: కేపీహెచ్‌బీలో రూ.43 కోట్లతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు.

MARUTI SAGAR, KUKATPALLY
Published on: 12 Aug 2026 1:39 PM IST
Kukatpally
X

Kukatpally: KPHBలో రూ.43 కోట్లతో ఇందిరమ్మ టవర్స్ నేడు CM రేవంత్ భూమిపూజ!

Kukatpally: కూకట్‌పల్లి మారుతి సాగర్ కేపీహెచ్‌బీ 7, 9వ ఫేజ్‌, గోకుల్‌ ప్లాట్స్‌ మధ్య 5.87 ఎకరాల స్థలంలో రూ.43 కోట్లతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. నాలుగు టవర్లలో ఫేజ్‌-1 కింద 480, ఫేజ్‌-2 కింద 680 ఇళ్లను నిర్మించనున్నారు.

ప్రభుత్వం ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండి రమేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామని, ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MARUTI SAGAR, KUKATPALLY

MARUTI SAGAR, KUKATPALLY

Next Story