Hyderabad: సోషల్ మీడియాలో 'రిచ్ కిడ్స్'కు వల.. వంద మంది మైనర్లను మోసం చేసిన కేటుగాడు అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికలను సోషల్ మీడియాలో ట్రాప్ చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ అరెస్ట్. 100 మందికి పైగా మోసం చేసిన కేటుగాడి గుట్టురట్టు చేసిన షీ టీమ్స్.

Arun Chilukuri
Published on: 20 April 2026 11:14 AM IST
Hyderabad
X

 Hyderabad: సోషల్ మీడియాలో 'రిచ్ కిడ్స్'కు వల.. వంద మంది మైనర్లను మోసం చేసిన కేటుగాడు అరెస్ట్!

Hyderabad: భాగ్యనగరంలోని సంపన్న ఏరియా జూబ్లీహిల్స్ కేంద్రంగా సాగుతున్న ఒక భారీ సోషల్ మీడియా మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను ట్రాప్ చేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ అనే కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు ఆజాద్ అత్యంత పక్కా ప్లాన్‌తో మోసాలకు పాల్పడేవాడు. ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న పారిశ్రామికవేత్తల పిల్లలను లక్ష్యంగా చేసుకునేవాడు. వారి ఇంట్లో పనిచేసే సిబ్బందిని సైతం తన మాటలతో బురిడీ కొట్టించి, మైనర్ అమ్మాయిల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ఆ సమాచారంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వారిని పరిచయం చేసుకుని, ఆపై ట్రాప్ చేసేవాడు.

నమ్మకంగా స్నేహం చేసి, ఆపై వారి నుంచి రహస్యంగా వ్యక్తిగత వివరాలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు దిగేవాడు. పరువు పోతుందన్న భయంతో బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు. ఇప్పటివరకు దాదాపు 100 మందిని ఇతడు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ మరియు జూబ్లీహిల్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. పిల్లలు సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story