Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో టవేరా కారు దొంగతనం ముఠా గుట్టురట్టు!
Hyderabad: హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టవేరా కారు దొంగతనం చేసిన నిందితుల అరెస్ట్. 21 కేసుల్లో నిందితుడైన సర్ఫరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో టవేరా కారు దొంగతనం ముఠా గుట్టురట్టు!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ఇంటి ముందు పార్క్ చేసిన కారులను దొంగలిస్తున ముఠా గుట్టురట్టు చేసిన ఐఎస్ సదన్ పోలీసులు. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరి నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన చేవ్రొలెట్ టవేరా కారును అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
కారు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఐ.ఎస్.సదన్ పోలీసులు రాజేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ సర్ఫరాజ్ (23)తో పాటు ఓ బాల నేరస్థుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తమదైన శైలి విచారించిన క్రైం పోలీసులు వీరు చేసిన దొంగతనం ఒప్పుకున్నారు. వీరి నుంచి టవేరా కారు, బర్గ్‌మన్ ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు సర్ఫరాజ్‌పై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 21 ఆస్తి సంబంధిత కేసులు ఉన్నట్లు ఏసీపీ సుఖ్‌దేవ్ సింగ్ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న ఐ.ఎస్ సదన్ సిఐ సాయి ప్రకాష్ గౌడ్ ను అభినందించారు.




