Quthbullapur: బోనాల చెక్కుల పంపిణీ.. పాల్గొన్న విప్ రామచందర్ నాయక్!
Quthbullapur: యోజకవర్గం జగద్గిరిగుట్టలో బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ కమిటీలకు ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్ చెక్కులను పంపిణీ చేశారు.
Quthbullapur: బోనాల చెక్కుల పంపిణీ.. పాల్గొన్న విప్ రామచందర్ నాయక్!
కుత్బుల్లాపూర్: బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచందర్ నాయక్, మాజీ కార్పొరేటర్ లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ
కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో బోనాల పండుగను పురస్కరించుకొని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోర్నకల్ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్, మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ , మంత్రి సత్యనారాయణ లు పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకతీతంగా వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణ సాంప్రదాయానికి బోనాల పండుగ ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.
ముఖ్యంగా హైదరాబాదులో బోనాల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో అర్హత గల అమ్మవారి ఆలయాలకు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ex చైర్మన్ నరేందర్ రెడ్డి, నాయకులు k Jaihind ‘Ashok Vanu Yadav ‘యాదగిరి, ప్రవీణ్ కుమార్ గుప్తా, బ్రహ్మానంద చారి, సత్తిరెడ్డి, విగ్నేష్, మహేందర్ గౌడ్, ముఖేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




