Quthbullapur: స్క్రాప్ గోదాంలో చోరీ.. వేగంగా కేసు ఛేదించిన పోలీసులు

Quthbullapur: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి రోడా మేస్త్రీ నగర్‌లో గల స్క్రాప్ గోదాంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 2 May 2026 9:35 PM IST
Quthbullapur
X

Quthbullapur: స్క్రాప్ గోదాంలో చోరీ.. వేగంగా కేసు ఛేదించిన పోలీసులు

Quthbullapur: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడా మేస్త్రీ నగర్‌లో ఉన్న ఒక స్క్రాప్ గోదాంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఏప్రిల్ 30 రాత్రి యజమాని గోదాం తాళం వేసి వెళ్లగా, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు మరియు లోపలి డ్రాయర్ పగులగొట్టి నగదు మాయమైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నమ్మకమైన సమాచారం మేరకు ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 8,000 నగదుతో పాటు ఒక డియో స్కూటీ మరియు ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో ఆ బాలుడు రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న పాత సామాన్ల దుకాణాలు, నిర్మాణం జరుగుతున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి నగదు, కాపర్ వైర్లు వంటి వస్తువులను దొంగిలించి వాటిని అమ్ముతుంటాడని పోలీసులు తెలిపారు. సదరు బాలుడిపై గతంలోనూ హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పలు బైక్ దొంగతనాలు, ఇళ్లలో చోరీ చేసిన కేసులు ఉన్నాయి. మే 2న అదుపులోకి తీసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డుకు తరలించినట్లు జగద్గిరిగుట్ట డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర రెడ్డి వెల్లడించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story