Medchal: జగద్గిరిగుట్టలో రూ.1000 కోట్ల దేవుడి భూమిపై హైకోర్టు సంచలన తీర్పు!

Medchal: జగద్గిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన రూ. 1,000 కోట్ల విలువైన 14.10 ఎకరాల భూమి దేవుడిదేనని హైకోర్టు తేల్చింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 17 May 2026 2:50 PM IST
Medchal
X

Medchal: జగద్గిరిగుట్టలో రూ.1000 కోట్ల దేవుడి భూమిపై హైకోర్టు సంచలన తీర్పు!

మేడ్చల్: మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలోని 14.10 ఎకరాల భూమి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానిదేనని హైకోర్టు తేల్చింది. సర్వే నంబర్ 348/1 లోని రూ.వెయ్యి కోట్ల విలువైన ఈ భూమి చుట్టూ 12 వారాల్లోగా కంచె ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ తీర్పు చెప్పారు. ఆలయం తరపున చైర్మన్ నరేంద ర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో ఆలయ భూమిని కొందరు ఆక్రమించి ప్లాట్లు వేయడం, అనధికారిక నిర్మాణాలు చేస్తు న్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవలేదని పేర్కొన్నారు. న్యాయవాది కె.ఎం.మహేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆక్రమణలను తొలగించి ఆలయ భూమిని కాపాడాలని కోరారు.

ఇందిరాగౌడ్ అనే మహిళ ఆలయ భూమిలో 1.20 ఎకరాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, ఆక్రమణలను తొలగించాలంటూ గత ఏడాది డిసెంబర్లో అధికారులకు వినతిపత్రం ఇచ్చినా చర్యలు లేవన్నారు. ఆ భూమిలో ఆర్టీసీ వినియోగిస్తున్న గదు లకు అద్దె రూపంలో నెలకు రూ.29 వేల చెల్లింపులు ఆలయానికి వచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. దీనిపై దాయ శాఖ తరపున న్యాయవాది స్పందిస్తూ, 2013 ఆలయ భూముల సర్వే కోసం సర్వే శాఖకు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దేవాదాయ లేఖ రాశారని తెలిపారు. ఆలయానికి తగిన ఆదాయం లేక పోవడంతో కంచె ఏర్పాటు చేయలేకపోయినట్లు చెప్పారు. ప్రతివాది ఇందిరాగౌడ్ తరపు న్యాయవాది వాదనలు విని పిస్తూ, ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం ఈ భూమిని తన క్లయింట్తో పాటు మరికొందరు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిందని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు, ఆలయ భూమికి కంచె ఏర్పాటు బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story