Secunderabad: ఎమ్మెల్యే గణేష్‌కు ఆ స్థాయి లేదు.. జక్కుల మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Secunderabad: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి విమర్శలు. కంటోన్మెంట్ అభివృద్ధి కేసీఆర్ ఘనతేనని వ్యాఖ్య.
Secunderabad: ఎమ్మెల్యే గణేష్‌కు ఆ స్థాయి లేదు.. జక్కుల మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Secunderabad: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే స్థాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు లేదని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ లోని బోయిన్పల్లి లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినదే కేసీఆర్ అని అప్పుడు పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట మార్చడం ఎంతవరకు సమంజసమని జక్కుల మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 420 హామీలు ఇచ్చి అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వము దమ్ముంటే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంటుకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినంక ప్రజలకు దురదృష్టం పట్టిందని కంటోన్మెంట్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదని జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు.




