Hyderabad: జలమండలి వార్నింగ్: నీటిని వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్.. రేపటి నుంచే స్పెషల్ డ్రైవ్!
Hyderabad: హైదరాబాద్‌లో నీటి ఎద్దడి నివారణకు జలమండలి కసరత్తు. నీటిని వృథా చేస్తే కనెక్షన్లు కట్ చేస్తామని ఎండి అశోక్ రెడ్డి హెచ్చరిక. రాబోయే 45 రోజులు అత్యంత కీలకమని వెల్లడి.
Hyderabad: జలమండలి వార్నింగ్: నీటిని వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్.. రేపటి నుంచే స్పెషల్ డ్రైవ్!
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జలమండలి ఎండి (MD) అశోక్ రెడ్డి తెలిపారు. నగరంలో పెరుగుతున్న నీటి డిమాండ్, ట్యాంకర్ల బుకింగ్స్ మరియు నీటి వృథాను అరికట్టడంపై ఆయన శనివారం మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు.
ట్యాంకర్లకు రికార్డు స్థాయి డిమాండ్:
నగరంలో ప్రతి ఏటా ట్యాంకర్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని, ముఖ్యంగా మూడు డివిజన్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఒక్కరోజే నగరవ్యాప్తంగా 11,792 ట్యాంకర్లు బుక్ అయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గత 105 రోజుల్లో మొత్తం 6,19,743 ట్యాంకర్లు బుక్ అయినట్లు డేటా వెల్లడించింది.
నీటి వృథా చేస్తే కనెక్షన్ కట్:
నీటిని వృథా చేసే వారిపై రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎండి హెచ్చరించారు. "గతేడాది 1,354 మందికి పెనాల్టీలు వేశాం. ఈసారి పదే పదే నీటిని వృథా చేసే వారి కనెక్షన్లను ఏమాత్రం మొహమాటం లేకుండా కట్ చేస్తాం. ప్రజలు కూడా వాలంటీర్లుగా మారి 'పానీ యాప్' ద్వారా నీటి వృథాను అరికట్టడంలో భాగస్వాములు కావాలి" అని ఆయన కోరారు.
కీలక అంశాలు:
ఫిల్లింగ్ స్టేషన్స్: గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 86 ఫిల్లింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్య సమయం: రాబోయే 45 రోజులు నగరానికి అత్యంత కీలకం. ఉదయం 8 నుంచి 12 గంటల మధ్యే అత్యధికంగా బుకింగ్స్ అవుతున్నాయి.
భవిష్యత్తు ప్రణాళిక: వచ్చే ఏడాదిన్నర కాలంలో గోదావరి ఫేజ్-3 అందుబాటులోకి రానుంది, తద్వారా నగర నీటి అవసరాలు మరింత సులభంగా తీరుతాయి.




