Jambagh: ఉస్మాన్ గంజ్‌లో రోడ్ల తనిఖీ బోనాల లోపు మరమ్మతులు

Jambagh: జాంబాగ్ డివిజన్‌లో మున్సిపల్ డీసీ ఉమా ప్రకాష్ పర్యటన. ఉస్మాన్ గంజ్, మహరాజ్ గంజ్ రోడ్ల సమస్యపై స్పందన. బోనాల పండుగలోగా మరమ్మతుల పూర్తికి హామీ.

GIRI, CENTRAL ZONE
Published on: 28 July 2026 9:30 PM IST
Jambagh
X

Jambagh: ఉస్మాన్ గంజ్‌లో రోడ్ల తనిఖీ బోనాల లోపు మరమ్మతులు

జాంబాగ్: జాంబాగ్ డివిజన్ లోని ఉస్మాన్ గంజ్,మహరాజ్ గంజ్ లలో రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని హమాలి కార్మిక సంఘం అధ్యక్షుడు ఎస్ ధన్రాజ్ అధికారుల దృష్టికి తీసుకు రావడం తో మున్సిపల్ డిప్యూటీ కమిస్నర్ ఉమా ప్రకాష్,పలు అధికారులతో కలిసి పర్యటించారు.

వాహన దారులు,స్థానికులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా డీసీ ఉమా ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ట్రాన్స్ పోర్ట్ వాహనాలు అధికముగా రాకపోకలు జరగడం తో రోడ్లు తొందరగా పాడవడం జరుగుతుందని అన్నారు.

రానున్న బోనాల పండుగ లోపు రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు.వాహనాల రకపోకలతో పాటు హమాళిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ అధికారులు త్వరితగతిన రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ధనరాజ్ కోరారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story