Cherlapally: జన విజ్ఞాన వేదిక 128వ ఉచిత వైద్య శిబిరం సక్సెస్!

Cherlapally: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 128వ ఉచిత వైద్య శిబిరం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ నేత సీతారాం రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించి, ఆర్థిక సాయం అందించారు.

ASHOK, KAPRA
Published on: 26 April 2026 5:38 PM IST
Cherlapally
X

Cherlapally: జన విజ్ఞాన వేదిక 128వ ఉచిత వైద్య శిబిరం సక్సెస్!

Cherlapally: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 128వ ఉచిత వైద్య శిబిరం ఆదివారం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీతారాం రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారాం రెడ్డి మాట్లాడుతూ..

సమాజంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత అవసరమని అన్నారు. జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న ఈ తరహా ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రశంసించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం కూడా సమాజ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. మెడికల్ క్యాబ్ నిర్వహణ నిమిత్తం నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా జెవివి నాయకులు మాట్లాడుతూ..ఎండాకాలంలో తాగునీరు ఎక్కువగా తీసుకోవడం, నేరుగా ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించడం, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. శిబిరంలో వైద్యులు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పిస్తూ, ముందస్తు జాగ్రత్తలపై సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, కోశాధికారి పి.నాగరాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాస్, సీనియర్ నాయకులు సోమయ్యచారి, శేషగిరిరావు, వెంకటరమణ, మెడికల్ క్యాంపు ఆర్గనైజర్ జి.కరుణాకర్ రెడ్డి. నాగేశ్వరరావు, మధు, శ్రీధర్, డాక్టర్లు విద్యాసాగర్, జయరాజ్, దేవీక, హోమియోపతి ఫిజీషియన్ డాక్టర్ సంగీత, ఆకుపెక్చర్ జనార్ధన చారి, లక్ష్మిరావు, బసవపున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story