Hyderabad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాదల చైతన్య!
Hyderabad: కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన క్రీడాకారులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించిన జనచైతన్య గ్రూప్స్ చైర్మన్ మాదల చైతన్య.
Hyderabad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాదల చైతన్య!
Hyderabad: కామన్వెల్త్ క్లాసిక్ & ఈక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న యువ క్రీడాకారులు మదీర షానన్, బొల్లు లికిత, సంక కౌశిక్ లకు జనచైతన్య గ్రూప్స్ చైర్మన్ శ్రీ మాదల చైతన్య గారు, ఇచ్చిన మాట ప్రకారం రూ.2,00,000/- (రెండు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయంగా అందజేశారు.
అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫున పోటీ పడనున్న ఈ యువ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా శ్రీ మాదల చైతన్య గారు క్రీడాకారుల పట్ల తన ప్రోత్సాహాన్ని, నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు.
ఈ సందర్భంగా శ్రీ మాదల చైతన్య గారు మాట్లాడుతూ, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం, వారి విజయయాత్రలో చేయూతనివ్వడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏ క్రీడాకారుడి ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
కామన్వెల్త్ క్లాసిక్ & ఈక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని మదీర షానన్, బొల్లు లికిత, సంక కౌశిక్ లకు శ్రీ మాదల చైతన్య గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులు, వారి కోచ్ శ్రీమతి సాయి రేవతి గారు మాట్లాడుతూ, తమపై నమ్మకం ఉంచి, ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించిన శ్రీ మాదల చైతన్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోత్సాహం తమలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, దేశానికి మంచి పేరు తీసుకురావడానికి మరింత కష్టపడి పోటీ పడతామని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ యువ క్రీడాకారులకు చేయూతనిచ్చిన శ్రీ మాదల చైతన్య గారి ప్రోత్సాహం వారికి మరింత స్ఫూర్తిని అందించింది.




