Hyderabad: యూసఫ్‌గూడ స్టేడియంలో జపాన్ కరాటే అసోసియేషన్ 18వ టోర్నమెంట్

Hyderabad: హైదరాబాద్ యూసఫ్‌గూడలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా 18వ టోర్నమెంట్. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జపాన్ కరాటే మాస్టర్లు హాజరు.

RAJESH,	WEST ZONE
Published on: 21 Aug 2026 3:17 PM IST
Hyderabad
X

Hyderabad: యూసఫ్‌గూడ స్టేడియంలో జపాన్ కరాటే అసోసియేషన్ 18వ టోర్నమెంట్

Hyderabad: హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన 18 వా కాంపిటేషన్ నిర్వహించారు. దాదాపు 500 మంది కరాటే జపాన్ కరెక్టే కి సంబంధించిన మాస్టర్లతో పాటు యువకులు యువతులు పాల్గొన్నారు. జపాన్ నుంచి వచ్చిన ముఖ్యఅతిథి తనయమ షిశాన్ హాకీ జూమ్ రాసిన షిశాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు.

ప్రతి ఒక్క యువకుడికి ఆత్మ రక్షణ కోసం కరటే నేర్చుకోవాల్సిందే అని జపాన్ కి సంబంధించిన మాస్టర్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలకి యువతులకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఎక్కడ ఎలాంటి సంఘటన తన పైకి వచ్చినప్పుడు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలని జపాన్ కరాటే అసోసియేషన్ వారు గత 18 సంవత్సరాల నుండి తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. యువకులని ప్రోత్సహించడానికి కాంపిటేషన్లు కూడా నిర్వహిస్తున్నారా అన్నారు.

ఈ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ప్రాక్టీస్ నిర్వహించిన తర్వాత రెండో రోజు నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానున్నది ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా కరాటే కాంపిటీషన్లో యువకులు యువకులు పాల్గొన్నారు.

మూడోరోజు కార్యక్రమం ఫైనల్ కాంపిటేషన్ తర్వాత విజేతలకు ట్రోఫీలు అందజేయనున్నారు. ఇలాంటి కార్యక్రమాలను జపాన్ కరాటే అసోసియేషన్ వారు నిర్వహించడం చాలా సంతోషకరమని జపాన్ నుంచి వచ్చిన మాస్టర్లు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story