Jawahar Nagar: రోడ్లపై చెత్త కుప్పలు స్థానికుల తీవ్ర అసహనం!
Jawahar Nagar: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ. రోడ్లపై పేరుకుపోయిన చెత్త కుప్పలు. వెంటనే తొలగించాలని కాలనీవాసుల విజ్ఞప్తి.
Jawahar Nagar: రోడ్లపై చెత్త కుప్పలు స్థానికుల తీవ్ర అసహనం!
Jawahar Nagar: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లపై చెత్తను పడవేయడంతో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. కాలనీలకు స్వాగత తోరణాల మాదిరిగా రోడ్లపై చెత్త పేరుకుపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చెత్త కారణంగా దుర్వాసన వ్యాపించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటోందని కాలనీవాసులు పేర్కొంటున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే స్పందించి రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, నిత్యం చెత్త సేకరణ చేపట్టి కాలనీల్లో పరిశుభ్రతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.




