Jawahar Nagar: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా పొలాస అశోక్ ఏకగ్రీవం

Jawahar Nagar: జవహర్ నగర్ డివిజన్-3 బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా పొలాస అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నియామక పత్రం అందజేశారు.

PURENDAR, ALWAL
Published on: 30 Oct 2026 6:59 PM IST
Jawahar Nagar
X

Jawahar Nagar: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా పొలాస అశోక్ ఏకగ్రీవం

జవహర్ నగర్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్–3 బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా పొలాస అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా నియమితులైన అశోక్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. యువతను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో యువత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మేయర్ మేకల కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్, మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, ఆలూరు రాజశేఖర్, మాజీ వార్డు మెంబర్ పల్లపు ఉపేంద్ర, సింగన్న, బాలరాజ్, సిద్ధులు యాదవ్, పొలాస సాయి కుమార్, బండి నవీన్, కృష్ణ యాదవ్, పల్లపు ప్రశాంత్, రాజు, అజీమ్, రవి, మల్లమ్మ, యాకమ్మ, యధాలక్ష్మి, కళావతి, లక్ష్మి, విమల, మహేశ్వరి, ధనలక్ష్మితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL