Jawaharnagar: లోతట్టు ప్రాంతాల్లో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి పర్యటన

Jawaharnagar: జవహర్‌నగర్ సంతోష్‌నగర్‌లో భారీ వర్షాల ప్రభావంపై మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ పర్యటన. జేసీబీలతో కాలువల పూడికతీత పనులు.

PURENDAR, ALWAL
Published on: 14 Sept 2026 6:23 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: లోతట్టు ప్రాంతాల్లో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి పర్యటన

జవహర్‌నగర్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్‌నగర్ డివిజన్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సంతోష్‌నగర్, పాపయ్యనగర్ కాలనీల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయాన్ని స్థానిక ప్రజలు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సంతోష్‌నగర్ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, వారి సహకారంతో జేసీబీ ద్వారా కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.

ప్రజల సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి, అధికారులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న రెడ్డి శెట్టి శ్రీనివాస్‌కు స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యే తన సమస్యగా భావించి, ఆపద సమయంలో వెంటనే స్పందించడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL