Jawaharnagar: స్వయంకృషి సేవా సమితి 35వ వార్షికోత్సవం

Jawaharnagar: జవహర్‌నగర్‌లో స్వయంకృషి సేవా సమితి 35వ వార్షికోత్సవానికి హాజరైన మంత్రి సీతక్క మహిళల స్వయం ఉపాధిని, ఉత్పాదకతను ప్రత్యేకంగా అభినందించారు.

PURENDAR, ALWAL
Published on: 16 Nov 2026 9:41 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: స్వయంకృషి సేవా సమితి 35వ వార్షికోత్సవం

జవహర్ నగర్‌: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లో ‘స్వయంకృషి సేవా సమితి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన 35వ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంస్థ తరఫున మహిళలు కుట్టుపని ద్వారా తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. మహిళల పనితీరును, వారిలో ఉన్న సృజనాత్మకతను, పరస్పర సహకారంతో సాగుతున్న ఉత్పాదకతను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. స్వయంకృషితో మహిళలు స్వయం ఉపాధి పొందడం ఎందరికో ఆదర్శమని కొనియాడారు.

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. గత 35 ఏళ్లుగా స్వయంకృషి సేవా సమితి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. మహిళా సాధికారత కోసం సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL