Jawaharnagar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ దీక్షకు మల్లారెడ్డి మద్దతు

Jawaharnagar: జవహర్‌నగర్ చెన్నాపురం చౌరస్తాలో డంపింగ్ యార్డ్ జేఏసీ రిలే నిరాహార దీక్షకు హాజరై పాట పాడి మద్దతు తెలిపిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.

PURENDAR, ALWAL
Published on: 22 Nov 2026 9:51 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ దీక్షకు మల్లారెడ్డి మద్దతు

జవహర్ నగర్: డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, చెన్నాపురం చౌరస్తా వద్ద, డంపింగ్ యార్డ్ జేఏసీ నాయకులు రిలే నిరాహార దీక్ష మొదలు పెట్టడంతో, డంపింగ్ యార్డ్ పై పాట పాడి మరి జేఏసీ నాయకులకు మద్దతు ప్రకటించిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.

సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ వల్ల రోజుకు ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని, అత్యధిక విషవాయువు వెలుపడే వాటిలో,ప్రపంచంలోనే, నాలుగవ స్థానంలో, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉందని, ఈ డంపింగ్ యార్డ్ ను ఇలాగే కొనసాగిస్తే, డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే, విషవాయువు, కాలుష్యానికి పెద్ద ఎత్తున నష్టపోతామని, అందుచేతనే, జేఏసీ వాళ్లు తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారని తెలిపారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL