Hyderabad: రూ.10 లక్షల చీటీ డబ్బుల ఎగవేత.. వ్యాపారి రమేష్ అరెస్ట్!
Hyderabad: చీటీ డబ్బులు రూ.10 లక్షలు ఎగ్గొట్టి చెక్ బౌన్స్ చేసిన కేసులో మౌలాలికి చెందిన వ్యాపారి నల్ల రమేష్‌ను జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
Hyderabad: రూ.10 లక్షల చీటీ డబ్బుల ఎగవేత.. వ్యాపారి రమేష్ అరెస్ట్!
హైదరాబాద్: చీటీ వ్యాపారం పేరుతో రూ.10 లక్షలు తీసుకుని, గడువు ముగిసిన అనంతరం డబ్బులు చెల్లించకుండా చెక్కు బౌన్స్ చేసిన ఘటనలో చీటీ వ్యాపారిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మౌలాలి హౌసింగ్ బోర్డుకు చెందిన నల్ల రమేష్ శ్రీశైలం కుమారుడు.
ఆయన ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ చీటీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో సాకేత్‌కు చెందిన ఏ. వెంకటేశ్వర్లు ఆయన వద్ద రూ.10 లక్షల చీటీ వేశారు. సుమారు 25 నెలల పాటు క్రమం తప్పకుండా చీటీలు చెల్లించిన అనంతరం గడువు ముగియడంతో తనకు రావాల్సిన రూ.10 లక్షలకు రమేష్ చెక్కు ఇచ్చినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయింది. పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నా నగదు ఇవ్వకపోవడంతో వెంకటేశ్వర్లు జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు.




