ప్లాట్లు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కేటుగాడు
Jawaharnagar: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలో ప్లాట్ల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది.
ప్లాట్లు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కేటుగాడు
Jawaharnagar: జవహర్‌నగర్ పరిధిలోని పలు కాలనీలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేసిన వెంకటేష్ తమను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
అయితే బాధితులు ఇంటి వద్దకు చేరుకునే సరికి వెంకటేష్ తాను నివసిస్తున్న ఇంటిని కూడా అమ్ముకుని, రాత్రికి రాత్రే కుటుంబంతో కలిసి పరారైనట్లు తెలిసి షాక్‌కు గురయ్యారు. తమ కష్టార్జిత సొమ్మంతా కోల్పోయామని, ఇప్పుడు న్యాయం కోసం తిరుగుతున్నామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
వెంకటేష్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, తమ డబ్బులు తిరిగి ఇప్పించేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరెందరో అమాయకులు బలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.




