Quthbullapur: గంజాయి సేవిస్తున్న 8 మంది అరెస్ట్: జీడిమెట్ల పోలీసులు!
Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్లలో గంజాయి సేవిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Quthbullapur: గంజాయి సేవిస్తున్న 8 మంది అరెస్ట్: జీడిమెట్ల పోలీసులు!
Quthbullapur: గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా జీడిమెట్ల పోలీసులు గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
అరెస్టయిన ఎనిమిది మందిపై జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తదితర మాదకద్రవ్యాల కలిగి ఉండటం, రవాణా, సరఫరా, విక్రయం, వినియోగం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జీడిమెట్ల పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మాదకద్రవ్యాల విక్రయం, సరఫరాకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే తెలియజేయాలని తల్లిదండ్రులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ విక్రేతలు, సరఫరాదారులు, నిల్వదారులు, వినియోగదారులపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.




