Hyderabad: ప్రభుత్వ బడులకు పోలీస్ రక్షణ.. ఐడియా అదిరింది!

Hyderabad: వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల రక్షణకు జీడిమెట్ల పోలీసుల చొరవతో ఓ ప్రైవేట్ సంస్థ అండగా నిలిచింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 18 Jun 2026 11:20 AM IST
Hyderabad
X

Hyderabad: ప్రభుత్వ బడులకు పోలీస్ రక్షణ.. ఐడియా అదిరింది!

హైదరాబాద్: వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల రక్షణకు జీడిమె ట్ల పోలీసుల చొరవతో ఓ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఇన్స్పెక్టర్ను సత్కరించిన జెమిని కుమారి, విద్యార్థులు కుత్బుల్లాపూర్ మండల ఇన్ ఛార్జి ఎంఈవో జెమిని కుమారి అభినందించారు.

వేసవి సెలవుల సందర్భంగా జీడిమెట్ల ఠాణా పరిధిలోని అయిదు ప్రభుత్వ స్కూళ్లకు కాపలా దారులను నియమించేందుకు ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ చొరవ చూపారు.

పారిశ్రామిక వాడలోని పుజ్లోనా సంస్థ సహకారంతో 10 మంది కాపలా దారులను నియమించారు. అలాగే పోలీసుల ఆధ్వర్యంలో 10 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేయించారు.

ప్రస్తుతం బడులు పునఃప్రారంభమైన నేపథ్యంలో.. పాఠశాలలను సురక్షితంగా కాపాడినందుకు ఎంఈవో జెమిని కుమారి, ప్రధానోపాధ్యాయులు బుధవారం జీడిమెట్ల ఠాణాలో ఇన్ స్పెక్టర్, దాతలను ఘనంగా సత్కరించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story