Jillelguda: కాంగ్రెస్ నిరసన కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్!

Jillelguda: నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.

RAHUL, MEERPET
Published on: 23 July 2026 4:31 PM IST
Jillelguda
X

Jillelguda: కాంగ్రెస్ నిరసన కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్!

Jillelguda: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లెలగూడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టులను ఖండిస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలను ధరించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పీసీసీ జనరల్ సెక్రటరీ పారిజాత నరసింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story