Kukatpally: జేఎన్టీయూ హాస్టల్స్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ!

Kukatpally: జేఎన్టీయూ హాస్టల్‌లో తీజ్ వేడుకల వివాదంతో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగి కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి.

MARUTI SAGAR, KUKATPALLY
Published on: 4 Sept 2026 8:06 AM IST
Kukatpally
X

Kukatpally:జేఎన్టీయూ హాస్టల్స్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ!

Kukatpally: జేఎన్టీయూ క్యాంపస్‌లో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జేఎన్టీయూ హాస్టల్స్‌లో రెండు స్టూడెంట్ యూనియన్లకు చెందిన విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. తీజ్ ప్రోగ్రామ్‌లో ఏర్పడిన వివాదమే ఘర్షణకు కారణమని సమాచారం.

స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు అర్ధరాత్రి విద్యార్థుల గదుల్లోకి వెళ్లి దాడి చేశారంటూ ఆరోపణలు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తపై కూడా దాడి చేసినట్లు ఆరోపణలు.. అనంతరం ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నట్లు సమాచారం.

విద్యార్థుల ఘర్షణతో జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MARUTI SAGAR, KUKATPALLY

MARUTI SAGAR, KUKATPALLY

Next Story