Banjara Hills: జర్నలిస్టులకు అలర్ట్ వార్త రాసే ముందు ఇది మర్చిపోకండి!

Banjara Hills: ఉన్నత విద్యలో బాధ్యతాయుతమైన జర్నలిజం అనే అంశంపై ఆస్కీ నిర్వహించిన వర్క్ షాప్‌లో సీనియర్ పాత్రికేయులు జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 9 May 2026 12:00 PM IST
Banjara Hills
X

Banjara Hills: జర్నలిస్టులకు అలర్ట్ వార్త రాసే ముందు ఇది మర్చిపోకండి!

బంజారాహిల్స్: నైపుణ్యాల అభివృద్ధికి వర్క్ షాప్ లు ఎంతగానో దోహదపడతాయని సీనియర్ పాత్రికేయులు జ్వాలా నరసింహారావు అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లోని ఆస్కీ కార్యాలయంలో ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రెస్పాన్సిబుల్ జర్నలిజం ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ముఖ్యమంత్రి సి పి ఆర్ ఓ జ్వాలా నరసింహారావు హాజరై మాట్లాడారు.

ప్రతి పాత్రికేయుడు వార్త కథనాలు రాసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వర్క్ షాప్ లు నైపుణ్యాలను అభివృద్ధి పరచుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. మీడియా సంస్థలు పెరిగిన నేపథ్యంలో కథనాల ప్రచురణల లోప భూష్టంగా ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో పాత్రికేయులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కథనాలు ప్రచురించాలని సూచించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story