Jubilee Hills: జూబ్లీహిల్స్ క్లబ్‌లో అక్రమ ప్రవేశం సస్పెండ్ సభ్యులపై చర్యలు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన సస్పెన్షన్ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ వసంత్ కుమార్ హెచ్చరించారు.

RAJESH,	WEST ZONE
Published on: 30 Aug 2026 9:00 AM IST
Jubilee Hills
X

Jubilee Hills: జూబ్లీహిల్స్ క్లబ్‌లో అక్రమ ప్రవేశం సస్పెండ్ సభ్యులపై చర్యలు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన సస్పెండ్ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని గత పదకొండు నెలల క్రింద ఎన్నిక కాబడిన అధ్యక్షులు డాక్టర్ వసంత్ కుమార్ తెలియజేశారు.

దౌర్జన్యం చేయడమే కాకుండా మేమే అధ్యక్షులు,కార్య దర్శులం అంటూ కార్యాలయంలో కూర్చున్న సదరు మాజీ సభ్యులను గతంలోనే అవినీతి ఆరోపణలపై అత్యున్నత జనరల్ బాడీ మీటింగ్ ని ఏర్పాటుచేసి సభ్యుల ఆమోదం మేరకే సస్పెండ్ చేశామని అన్నారు. వారు తిరిగి దౌర్జన్యంగా క్లబ్ లోకి ప్రవేశించి క్లబ్ సీనియర్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే కాకుండా క్లబ్ ప్రతిష్టను దిగజార్చే పని చేశారని అన్నారు.వారు తీసుకువచ్చిన నోటీసులలోని మేజిస్ట్రేట్ మూడు,నాలుగు లైన్లను ఉపయోగించుకొని ఈ విధంగా దౌర్జన్యానికి దిగడం వారికి తగదు అన్నారు.

అదే నోటీసులలోనే ఏ విధమైన అభ్యంతరాలు ఉన్న న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అన్న విషయం వారు గమనించినట్టు లేదు అని అన్నారు.వెంటనే తాము చట్ట పరంగా పోలీసులను ఆశ్రయించడమే కాకుండా కోర్టును కూడా ఆశ్రయించనున్నామని అన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story