Jubilee Hills: హౌసింగ్ సొసైటీని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం శీనయ్య
Jubilee Hills: హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో గెలిపిస్తే పారదర్శకమైన అభివృద్ధి చేస్తానని అధ్యక్ష అభ్యర్థి శీనయ్య ప్రకటన. సొసైటీ బైలాస్ సవరణ, అక్రమాల వెలికితీతపై విలేకరుల సమావేశం.
Jubilee Hills: హౌసింగ్ సొసైటీని దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం శీనయ్య
Jubilee Hills: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కి జరగబోయే ఎన్నికలలో గెలిపిస్తే అద్భుతమైన అభివృద్ధి చేసి చూపిస్తానంటూ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కి జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసే శీనయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొట్లూరి శ్రీనివాస్, నడిమిపల్లి దుర్గా స్రవంతి లతో కలిసి మాట్లాడారు.
ఎన్నికలు అనగానే చిల్లర రాజకీయాలు చేసి తనపై అవాక్కులు చివాకులు పేలే వ్యక్తులందరూ ఇకనైనా ఇలాంటి చిల్లర వేషాలు మానుకోవాలని హితవు పలికారు.తన జీవితంలో ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఇప్పటివరకు తను నీతితో ఉన్నానని,తమ పానల్ గెలిచాక జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఇప్పటివరకు జరిగిన అక్రమాలన్నీ వెలికి తీస్తామని అన్నారు. ఇప్పటివరకు అక్రమార్కులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ బైలాస్ అన్ని తమకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించుకున్నారని వాటి నన్నింటిని పారదర్శకంగా ఉండే విధంగా అందరి అనుమతితో మార్చి భారతదేశంలోనే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ని, క్లబ్ ను నెంబర్ వన్ క్లబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.




