Jubilee Hills: ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ.. ప్రారంభించిన ఎమ్మెల్యే!

Jubilee Hills: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న చీరలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 23 Jun 2026 5:41 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ.. ప్రారంభించిన ఎమ్మెల్యే!

Jubilee Hills: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్, శాలివాహన నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను స్వయం సహాయక సంఘాల మహిళలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన మరియు సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

మహిళల పట్ల గౌరవం, మన సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల ఆదరణకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. మన సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా అత్యుత్తమ నాణ్యత, ఆకర్షణీయమైన రంగులు, అందమైన డిజైన్లతో రూపొందించిన ఈ చీరలు మహిళలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోరబండ డీసీ ఉమా మేడం గారు, డీసీ సురేష్ గారు, డీపీఓ మాలతి గారు, సీఓ శ్రీనివాస్ గారు, వెంకట్ గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story