Hyderabad: అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Hyderabad: జూబ్లీహిల్స్ మధురానగర్ బీ బ్లాక్‌లో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్; ప్రత్యేక పూజలు.

RAJESH,	WEST ZONE
Published on: 23 Nov 2026 6:39 PM IST
Hyderabad
X

Hyderabad: అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మధురానగర్ బి బ్లాక్‌లో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు, నిర్వాహకులు ఎమ్మెల్యే గారికి ఆత్మీయ స్వాగతం పలికారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహా పడిపూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE