Jubilee Hills: ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యం ఎమ్మెల్యే!
Jubilee Hills: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ.జీ. కాలనీ డివిజన్ పరిధిలోని వీడియో గల్లీలో ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పర్యటించారు
Jubilee Hills: ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యం ఎమ్మెల్యే!
జూబిలీ హిల్స్: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఓ ఇంటిలో నిలిచిపోయిన మురుగు నీటిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గారు, సమస్య తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి వెంటనే మురుగు నీటిని తొలగించి, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ,ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యమని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తన సమస్యగా భావించి వేగంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు..
ప్రతి కాలనీలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తమ లక్ష్యం అని అన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.




