Hyderabad: బోరబండలో దేవాలయాలకు బోనాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Hyderabad: బోరబండలో 14 దేవాలయాలకు ప్రభుత్వ బోనాల ఆర్థిక సహాయ చెక్కులను అందజేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. వచ్చే ఏడాది మరిన్ని నిధులు తెస్తానని హామీ.
Hyderabad: బోరబండలో దేవాలయాలకు బోనాల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ పరిధిలో బోనాల పండుగలను నిర్వహించనున్న అర్హత కలిగిన దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయ చెక్కులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పంపిణీ చేశారు. మొత్తం రూ.77 వేల విలువైన 14 చెక్కులను ఆయా దేవాలయ కమిటీల ప్రతినిధులకు అందజేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది దేవాలయాలకు మరింత అధికంగా ఆర్థిక సహాయం అందేలా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారితో చర్చించి, అదనపు నిధులు మంజూరయ్యేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు..
బోనాల పండుగలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరగాలని, అమ్మవారి కృపాకటాక్షాలు బోరబండ ప్రాంత ప్రజలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరిపై, రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆనంద్ గారు, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..




