Hyderabad: ప్రభుత్వ పాఠశాలలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆకస్మిక తనిఖీ!

Hyderabad: యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లోని ప్రభుత్వ పాఠశాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి నవీన్ యాదవ్ ఆకస్మికంగా సందర్శించారు.

RAJESH,	WEST ZONE
Published on: 17 Jun 2026 7:31 PM IST
Hyderabad
X

Hyderabad: ప్రభుత్వ పాఠశాలలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆకస్మిక తనిఖీ!

హైదరాబాద్: నేడు యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లోని ప్రభుత్వ పాఠశాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు..

నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లు, టాయిలెట్లను మరమ్మతులు చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు..

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతమైన విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గారు తెలిపారు.. పాఠశాలలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించి, అవసరమైన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story