Hyderabad: వరుణ యాగం ఫలించింది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Hyderabad: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నిర్వహించిన వరుణ యాగం ఫలించింది. శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల మరుసటి రోజు నుంచే భారీ వర్షాలు.

RAJESH,	WEST ZONE
Published on: 1 Aug 2026 5:42 AM IST
Hyderabad
X

Hyderabad: వరుణ యాగం ఫలించింది జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జూలై 24న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలకు సుభిక్షం కలగాలని సంకల్పించి వైదిక పండితుల ఆధ్వర్యంలో ఘనంగా వరుణ యాగం నిర్వహించారు..

ఆ యాగం జరిగిన మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా ప్రతిరోజూ వర్షాలు కురుస్తుండటం విశేషంగా మారింది. ప్రజలు కూడా దీనిని దైవానుగ్రహంగా నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు..

హైదరాబాద్ నగర వాసులకు నీటి కొరత లేకుండా, రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత కోసం నిర్వహించిన ఈ వరుణ యాగం ఫలించి, సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం పట్ల భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story