Hyderabad: ఆసిఫ్‌నగర్, సీతారాంబాగ్‌లో సదర్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే!

Hyderabad: ఆసిఫ్‌నగర్, సీతారాంబాగ్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొని, యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 10 Nov 2026 12:53 PM IST
Hyderabad
X

Hyderabad: ఆసిఫ్‌నగర్, సీతారాంబాగ్‌లో సదర్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే!

Hyderabad: హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ మరియు సీతారాంబాగ్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాదవ సోదరులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొని, వారి సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే వేడుకల్లో భాగస్వాములయ్యారు. యాదవ సోదరులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారికి సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

యాదవ సమాజం ఐకమత్యంతో ముందుకు సాగాలని, యువత విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE