Hyderabad: నా బిల్డింగ్‌కు బలి ఇస్తా.. జూబ్లీహిల్స్‌లో బిల్డర్ అరాచకం!

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఏసీ టెక్నీషియన్లను గదిలో బంధించి, గన్‌తో బెదిరిస్తూ కులం పేరుతో దూషించిన శ్రీధర్ రావు.

RAJESH,	WEST ZONE
Published on: 22 Jun 2026 4:41 PM IST
Hyderabad
X

Hyderabad: నా బిల్డింగ్‌కు బలి ఇస్తా.. జూబ్లీహిల్స్‌లో బిల్డర్ అరాచకం!

Hyderabad: నా బిల్డింగ్ కు బలి ఇవ్వలేదు.. మీ శవంతో బలి ఇస్తా అంటూ బెదిరింపులు.. కాల్చి పారేస్తే అడిగే దిక్కులేదు.. కులం పేరుతో దూషిస్తూ దాడులు, నెంబర్ వన్ శ్రీధర్ రావు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎం ఆర్ పీ ఎస్ నేతల డిమాండ్. పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను తరలి వచ్చిన నేతలు.

బాధితుల కథనం ప్రకారం.. గుంటి శ్రీధర్ రావు అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో అరింతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. దీనిలో ఏసీలు బిగించేందుకు వచ్చిన టెక్నీషియన్లు, కంపెనీ ప్రతినిధులను గదిలో బంధించి చితకబాదదంతో పాటు కులం పేరుతో దూషిస్తూ గన్ తో కాల్చేసి తన బిల్డింగ్ కు బలి ఇస్తా అంటూ అరాచకం సృష్టించారు.

ఈ మేరకు బాధితులు పది రోజుల క్రితమే క్రితమే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదు దాంతో సోమవారం పెద్ద సంఖ్యలో ఎం ఆర్ పీ ఎస్ నేతలు కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. నలుగురు ముఖ్యమంత్రుల మద్దతు తనకు ఉందంటూ శ్రీధర్ రావు విర్రవేగుతున్నారు అని.. గన్ లైసెన్స్ వెంటనే క్యాన్సల చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story