Talakondapally: మానవత్వాన్ని చాటిన జూలపల్లి సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్!
Talakondapally: జూలపల్లి గ్రామానికి చెందిన అంజయ్య మృతి. బాధిత కుటుంబానికి రూ.3,000 అంత్యక్రియల ఆర్థిక సాయం అందించిన సర్పంచ్ కడారి శేఖర్ యాదవ్, ఉప సర్పంచ్.
Talakondapally: మానవత్వాన్ని చాటిన జూలపల్లి సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్!
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామానికి చెందిన *మంగలి చిన్న అంజయ్య* అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ *కడారి శేఖర్ యాదవ్* , డిప్యూటీ సర్పంచ్ *ఇంద్రకంటి శ్రీశైలం గౌడ్* వెంటనే ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా అంత్యక్రియల నిర్వహణ కోసం *రూ.3,000* ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలతో కలిసి మంగలి చిన్న అంజయ్య గారి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కడారి శేఖర్ యాదవ్ గ మాట్లాడుతూ, *"కష్టకాలంలో బాధిత కుటుంబాలకు గ్రామ పంచాయతీ అండగా ఉంటుంది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం"* అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జూలపల్లి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతునికి ఘనంగా నివాళులర్పించారు.




