Hyderabad: యూత్ కాంగ్రెస్ దౌర్జన్యాన్ని సహించేది లేదు.. బీజేపీ నేత!
Hyderabad: తెలంగాణ బీజేపీ ఆఫీసు ముట్టడి యత్నాన్ని ఖండించిన జూటూరు కీర్తిరెడ్డి. రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని మండిపాటు. నిందితులపై చర్యలకు డిమాండ్.
Hyderabad: యూత్ కాంగ్రెస్ దౌర్జన్యాన్ని సహించేది లేదు.. బీజేపీ నేత!
Hyderabad: యూత్ కాంగ్రెస్ నేతల బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ స్టేట్ ఎగ్జికుటీవ్ మెంబర్ కీర్తిరెడ్డి. రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు చేస్తోంది. ఇలాంటి దౌర్జాన్యాలను సహించేది లేదు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది.
అందుకే ఇలాంటి దాడులకు దిగుతోంది.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై ఇవాళ జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం.ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు ఎవరైనా తెలపొచ్చు కానీ.. హద్దు మీరి ప్రవహిస్తేతగిన మూల్యం చెల్లించక తప్పదు.
వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి రౌడీలను గుండాలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి దాడులు మునుపెన్నడూ జరగలేదు. ఇలాంటి దాడులకు ప్రజాస్వామ్య విరుద్ధమైనవి.
ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా..?
మీ ముఖ్యమంత్రి రాష్ట్ర పొలిమేరలు దాటనివ్వమని ఓ కేంద్ర మంత్రిని అనవచ్చు. ప్రధాని మోదీని ఇష్టమొచ్చినట్లు తిట్టొచ్చా..? ఇవాళ నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఓ సారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా..? ఇలాంటి చిల్లర రాజకీయాలను సహించేలది లేదు, భయపడేది లేదు.
విద్యార్థులకు మద్దతిస్తామంటే అడ్డుకున్న పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకోలేకపోయారు.
ప్రభుత్వానికి పోలీసుశాఖ వంతపాడుతోందా..?
అసలీ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా..? ఇంటలీజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి. ఇవాళ జరిగిన ఈ కాంగ్రెస్ దాడలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దాడికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదు.
మీకో న్యాయం.. మాకో న్యాయమా..?
ఢిల్లీ ఘటనపై మా మంత్రి రాజీనామా అన్నారు చేయించాం. ఇప్పుడు రాష్ట్రం లో పాల్ టెక్నిక్ విద్యార్థుల నిరసనలను అడ్డుకుని దాడులు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డికూడా రాజీనామా చేయాలి. మీకు దమ్ముంటే మీ సీఎం తో రాజీనామా చేయించండి. ఇదేనా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సంస్కృతి.




