Hyderabad: చట్టబద్ధంగా కొన్న భూములపై అసత్య ప్రచారాలు తగవు: కే. సాయిరెడ్డి!
Hyderabad: సర్ఫేసీ చట్టం ప్రకారం వేలంలో చట్టబద్ధంగా కొన్న 55 ఎకరాల భూమిపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సోమాజిగూడ ప్రెస్‌మీట్‌లో కే. సాయిరెడ్డి స్పష్టం చేశారు.
Hyderabad: చట్టబద్ధంగా కొన్న భూములపై అసత్య ప్రచారాలు తగవు: కే. సాయిరెడ్డి!
హైదరాబాద్: బ్యాంక్ వేలం పాట ద్వారా పొందిన భూమి విషయంలో ఆ స్థలం పాత యాజమాన్యం ఎం బి గ్రూప్ కు సంబందించిన వ్యక్తులు కొంతమంది తనపై అసత్య పూరిత ఆరోపణలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారని అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని అడ్వకేట్ పార్థసారథి, సాయిరెడ్డి కల్వకుర్తి వాసి తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయి రెడ్డి మాట్లాడుతూ ఆ స్థలానికి చెందిన గత యజమానులు మెనో నైట్ బ్రదరెన్ గ్రూప్ కు చెందిన వ్యక్తులు బ్యాంకులో భూమిని తాకట్టు పెట్టి రుణం తీసుకుని డీఫాల్ట్ కావడంతో, సర్ఫేస్ యాక్ట్ ప్రకారం బ్యాంకు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసిందన్నారు.
జడ్చర్ల స్క్వేర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 36, 37, 58, 59లో మొత్తం 55 ఎకరాల 4 గుంటల భూమిని బ్యాంకు వేలం వేసిందని కే. సాయిరెడ్డి తెలిపారు. తాను మరో ముగ్గురితో కలిసి వేలంలో పాల్గొని అత్యధిక బిడ్డర్‌గా నిలిచానని, బ్యాంకు సూచనల మేరకు మొత్తం నగదును చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నట్లు చెప్పారు.
రిజిస్ట్రేషన్ అనంతరం పాత యజమానులు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు వివిధ చట్టాల కింద సుమారు 42 కేసులు దాఖలు చేశారని తెలిపారు. అయితే వాటన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొని, కేసులు డిస్మిస్ చేయించుకున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం పాత కేసులు ఏవీ పెండింగ్‌లో లేవని, ఇటీవల ఒక కొత్త కేసు దాఖలైనట్లు తెలిసిందని, దానిపై త్వరలో విచారణ జరగనుందని చెప్పారు. భూమిపై తమకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నందున, దాన్ని వినియోగించుకునే పూర్తి హక్కు తమకే ఉందని పార్థసారథి స్పష్టం చేశారు. కోర్టుల తీర్పుల అనంతరం భూమిని స్వాధీనంలోకి తీసుకుని వినియోగించుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు.
తమ భూమిలోకి సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించి ట్రెస్పాస్, న్యూసెన్స్, శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను చట్టపరంగా ఎదుర్కొంటామని, ఎవరైనా చట్టవిరుద్ధంగా భూమిపై హక్కు కల్పించుకునే ప్రయత్నం చేస్తే అంగీకరించబోమని పేర్కొన్నారు.
ఇదే విధంగా సర్ఫేస్ యాక్ట్ కింద వేలం ద్వారా కొనుగోలు చేసిన ఇతర ఆస్తుల విషయంలో ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, తమ ఆస్తినే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని అన్నారు.
వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల ఆస్తుల విక్రయాలు జరిగినప్పటికీ, కేవలం తమ ఆస్తినే లక్ష్యంగా చేసుకుని వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా చట్టపరమైన మార్గంలో ముందుకు సాగుతామని, తమ ఆస్తి పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు కొనసాగిస్తామని సాయి రెడ్డి,పార్థసారథి తెలిపారు.




