Kadthal: రావిచేడ్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Kadthal: మైసిగండిలో కడ్తాల్ రావిచేడ్ జడ్పీ పాఠశాల 2014-15 ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక. 11 ఏళ్ల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాల నెమరువేత.
Kadthal: రావిచేడ్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2014-15 ఎస్ఎస్సీ బ్యాచ్ కు చెందిన విద్యార్థులు మైసిగండి లోని ఓ కన్వెన్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
11 సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఒక చోట చేరి ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్న నాటి తీపి గుర్తులను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆట పాటలతో హుషారుగా గడిపారు. తాము చదువుకున్న రావిచేడ్ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని తీర్మాణించుకున్నారు.
కార్యక్రమంలో రవి, అండేకార్ సాయికుమార్, వంశీ, రాజు, నరేష్, వినోద్, సందీప్, హరికృష్ణ, రాకేష్, ప్రశాంత్ అశోక్, శ్రీశైలం, గాయత్రి, వనిత, రోజా, స్వప్న, అశ్విని, తదితరులున్నారు..




